AP Budget 2023-24: రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, ఈ నెల 18న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, మండలి బీఏసీ సమావేశాలు జరుగుతాయి.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ 2023-24 సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, మండలి బీఏసీ సమావేశాలు జరుగుతాయి. ఆపై మధ్యాహ్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు

ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్‌ ఆమోదించనుంది. కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 18వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి.