Andhra Pradesh: ఈ రోజు జరిగే కాన్ఫరెన్స్ చరిత్ర తిరగరాయబోతోంది, జిల్లా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం (Collectors Meeting) అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం.

Andhra Pradesh: CM Chandrababu and Deputy CM Pawan Kalyan hold Review Meeting with collectors, SPs

Vjy, August 5: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం (Collectors Meeting) అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరముందని చెప్పారు.

ఇవాళ జరుగుతున్న కాన్పరెన్స్ చరిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ (Historic conference) అని, చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు. అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని... అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిన్నదని అన్నారు. ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఏపీ దెబ్బతిన్నదని... అధికారుల మనోభవాలను దెబ్బతీసారన్నారు.  వైసీపీ నేతపై హత్యాయత్నం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, కర్రలతో దాడి, కారు ధ్వంసం

మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్‌ వన్‌గా ఉంటాం. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.  వలంటీర్‌ వ్యవస్థలో మార్పులు, శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు, కొంతమందితోనే వలంటీర్ సిస్టమ్, చంద్రబాబు కీలక నిర్ణయం?

ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన.. వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు.‘‘బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకేరోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతాం’’ అని పవన్‌ అన్నారు.

ప్రజల నుంచి వస్తున్న సమస్యల్లో 80 శాతం రెవెన్యూ సంబంధిత అంశాలేనని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. ఆ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని చెప్పారు. స్వార్థం కోసం గత పాలకులు ఎన్నో అరాచకాలు చేశారన్నారు. అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపారు. నిర్వీర్యమైన వ్యవస్థలను చక్కదిద్దాల్సిన అవసరముందన్నారు. ప్రజల హక్కులన్నీ నిర్వీర్యం చేసేలా తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈనెలలోనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించబోతున్నట్లు చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now