Andhra Pradesh: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు, జనసేనను రౌడీసేనగా మార్చేశారు, నరసాపురంలో సీఎం జగన్ ఫైర్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన (CM Jagan laid foundation stone) చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Amaravati, Nov 21: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన (CM Jagan laid foundation stone) చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ (Andhra Pradesh Aqua University), బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు.
నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు.
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్‌సీపీనే గెలిపించారని సీఎం అన్నారు.