Jagananna Thodu: చిరువ్యాపారులకు సంక్రాంతి కానుక, ఆరో విడుత నగదును బొటన్ నొక్కి విడుదల చేసిన చేసిన సీఎం జగన్, చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని వెల్లడి
పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు (small vendors) నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం (Jagananna Thodu) ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ (CM YS Jagan disburse) చేశారు.
Amaravati, Jan 11: ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు (small vendors) నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం (Jagananna Thodu) ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ (CM YS Jagan disburse) చేశారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని, అందుకే వాళ్లకు అండగా నిలిచామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే (interest-free loans) రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారాయన. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని ఉద్ఘాటించారు.పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్.