Disha Patrol Vehicles: మహిళా రక్షణే మా ధ్యేయం, 163 దిశ పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులోకి, మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని తెలిపిన ఏపీ సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో (CM YS Jagan launches Disha Patrol Vehicles) ప్రారంభించారు.
Amaravati, Mar 23: ఏపీ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న జగన్ ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను (Disha Patrol Vehicles) అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో (CM YS Jagan launches Disha Patrol Vehicles) ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని తెలిపారు. ఇప్పటికే దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కాగా, ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు.
మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ (safety of women) కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.