Andhra Pradesh: ఇకపై అమరావతి మనందరి అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన

ఇప్పటికే 50 వేలకుపైగా ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసి 50,793 మందికి ఇళ్లు మంజూరు చేశారు

CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

Amaravati, July 24: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద నేడు రాజధాని అమరావతిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 50 వేలకుపైగా ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసి 50,793 మందికి ఇళ్లు మంజూరు చేశారు. మే 26న పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో ప్లాట్‌ ధర 10 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ ఇళ్లు నిర్మాణం అయ్యే ప్రాంతాల్లో 384.42 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించబోతున్నట్టు చెబుతోంది.

ఇందులో విద్య, ఆరోగ్య కోసం 73.74 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ ఇల్లు నిర్మాణానికి 1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. పావలా వడ్డీకి మరో 35 వేలు చొప్పున బ్యాంకు రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఫ్రీ ఇసుక ఇస్తున్నారు. సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్‌ ఫ్రేమ్స్‌తోపాటు ఇతర సామాగ్రిని ఇస్తున్నారు.

ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ

శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్క చెల్లెమ్మల సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాం. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ. 1370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. అక్క చెల్లెమ్మలకు ఇస్తున్న ఇంటి విలువ రూ. 7.5 లక్షలు. పేదలకు అండగా మార్పు మొదలైందని అన్నారు. సామాజిక అమరావతిగా మార్పుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయింది? మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యం. నా అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. కోర్టు కేసులతో దీనినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడే అప్పులు తక్కువని మండిపడ్డారు. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇది. చరిత్ర ఉన్నంతవరకూ ఇవాల మరిచిపోలేని రోజని సీఎం అన్నారు.

సీఎం ఇంకా ఏమన్నారంటే..

►ఇంటి పట్టాలు అందించి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి పునాదు వేస్తున్నాం

►చరిత్ర ఉన్నంతవరకూ ఇవాళ మరిచిపోలేని రోజు

►మన పేదల ప్రభుత్వానికి పెత్తందారుల కూటమికి యుద్ధం జరుగుతోంది

►పేదవాడికి ఏ మంచి పని జరిగినా అడ్డుకోవడమే వీరి పని

►పేదల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవకూడదా?

►పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలా?

►ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు

►పేదల శత్రువలపై పేదలు సాధించిన విజయం ఇది

►నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలందరికీ ఈరోజు మరిచిపోలేని రోజు

►ఇళ్లు కట్టిస్తానంటూ గతంలో చంద్రబాబు మోసం చేశారు

►పేదవాడికి ఇల్లు రాకూడదని అడ్డుకునేందుకు యత్నించారు

►పేదలకు ఇల్లు రాకూడదనేదే వీరందరి కుట్ర

►దీని కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు

►ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశాం