Jagananna Vidya Kanuka: స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక, నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను అందించిన సీఎం జగన్
స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరు స్కూల్‌లో డిజిటల్ తరగతి గదులను పరిశీలించిన సీఎం జగన్.. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు.
వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరు స్కూల్‌లో డిజిటల్ తరగతి గదులను పరిశీలించిన సీఎం జగన్.. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కింద ఏపీ ప్రభుత్వం అందిస్తోంది.
43.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక అందించనున్నారు. రూ. 1,042.53 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. నాలుగేళ్లలో విద్య కోసం రూ.60 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. తొలి దశలో నాడునేడు పూర్తయిన 15,715 స్కూళ్లలో డిజిటల్ విద్య, హైస్కూళ్లలో 30 వేల తరగతి గదులకు బైజూస్ కంటెంట్‌తో డిజిటల్ విద్య అందిస్తున్నారు.