CM YS Jagan Review: ఇసుక రవాణాలో ఎక్కడా అవినీతి ఉండకూడదు, అందుబాటు ధరలో పూర్తి పారదర్శక విధానం ఉండాలి, అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్
ఈ భేటీలో అధికారులకు మంత్రులకు సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ (AP CM) మరోసారి స్పష్టం చేశారు.
Amaravati, Oct 19: ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇసుక విధానంపై (sand policy) తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సీఎం సమీక్ష సమావేశం (AP CM YS Jagan Review Meeting) నిర్వహించారు. ఈ భేటీలో అధికారులకు మంత్రులకు సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ (AP CM) మరోసారి స్పష్టం చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో, పూర్తి పారదర్శక విధానం ఉండాలని అన్నారు. అలాగే ఇసుక సరఫరాలో ఎఫీషియన్సీ పెంచాలని, నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని సూచించారు. ఇసుక రీచ్‌లు సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని, వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుందని సీఎం అంచనా వేశారు.
ఇసుక తవ్వకాల్లో పారదర్శక విధానాన్ని అమలు చేయాలి. రవాణా వ్యయం ఎక్కువగా ఉంటుంది. చలాన్ కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలి. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ చేయాలి. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్‌ఈబీ రంగ ప్రవేశం చేస్తుంది. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి కావాల్సిన ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టర్ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు అస్సలు అమ్మడానికి వీల్లేదని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానితో పాటు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోమ్ మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్షజరిపిన విషయం తెలిసిందే
వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరా కిందవెంటనే రూ.2250 కోట్లు సాయం అందించాల్సిందిగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్ షా దృష్టికి తీసుకుపోయారు.