CM YS Jagan Polavaram Tour: పోలవరం పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి, గడువులోగా పోలవరం పనులు పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్న వైయస్ జగన్, ఏరియల్ సర్వే ద్వారా స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్ పనులు పరిశీలన
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు (Polavaram project) పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు.
Amaravati, July 19: ఏపీ సీఎం వైయస్ జగన్ పోలవరం (CM YS Jagan Polavaram Tour) చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు (Polavaram project) పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు.
స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులపై సీఎం అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలవరం వ్యూ పాయింట్ వద్ద నుంచి గోదావరి నదీ ప్రవాహ మార్గాన్ని సీఎం జగన్ పరిశీలించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
Here's Video
గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలవరంలో అధికారులతో భేటీ అనంతరం తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి చేరుకుంటారు.