CM Jagan Kadapa Tour Schedule: సీఎం జగన్ మూడు రోజుల కడప షెడ్యూల్ ఇదే, వైఎస్సార్‌ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి

ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు.. పర్యటన వివరాలను (CM YS Jagan YSR Kadapa District Tour) వెల్లడించారు.

CM-YS-jagan-Review-Meeting

Amaravati, Sep 1: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో (CM Jagan Kadapa Tour Schedule) మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు.. పర్యటన వివరాలను (CM YS Jagan YSR Kadapa District Tour) వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు.

2వ తేదీన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తారు. అదేరోజు పులివెందుల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. 3వ తేది ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కడప విమా నాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 9.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.

ఉదయాన్నే ఇంటికి ఫించన్, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ, 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు విడుదల

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

సెప్టెంబరు 1న

►మధ్యాహ్నం 2.00 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

►అక్కడి నుంచి విమానంలో 2.30 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

►3.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు.

►అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు.

►4.10 నుంచి 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు.

►అనంతరం అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాఫ్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

2వ తేదీన

►ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు.

►9 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

►ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 1.30 నుంచి 3 గంటల వరకు, 3.30 నుంచి 5 గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు.

►5.10 గంటలకు గెస్ట్‌హౌస్‌ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

3వ తేదీన

►ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి అక్కడే ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు 9 గంటలకు చేరుకుంటారు.

►అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

►9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తన నివాసానికి బయలుదేరి వెళతారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif