IPL Auction 2025 Live

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 478 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 715 మంది రికవరీ, రాష్ట్రంలో 4.420గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

అత్యధికంగా చిత్తూరు నుంచి 89, కృష్ణా జిల్లా నుంచి 62, గుంటూరు నుంచి 48, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 63, 58 కొత్త కేసులు నమోదయ్యాయి.....

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Amaravati, December 17:  ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ తీవ్రత భారీగా తగ్గుముఖం పట్టింది అయినప్పటికీ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. జనవరి రెండో వారం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది, అయితే అందరికీ వ్యాక్సిన్ రావాలంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం ద్వారానే ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  64,099మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 478 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య  8,76,814కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,73,919గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 89,  కృష్ణా జిల్లా నుంచి 62,  గుంటూరు నుంచి 48, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 63, 58   కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో మరో 3 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7067కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 715 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,65,327 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 4,420 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.