Andhra Pradesh: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఏపీడీసీ, ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్
ఇందుకోసం వాట్సాప్ తో ఒప్పందం (APADC Tie up With WhatsApp) కుదర్చుకుంది.
Amaravati, June 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు , కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్ (APDC) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్ తో ఒప్పందం (APADC Tie up With WhatsApp) కుదర్చుకుంది.
ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య వేటంగా పెరుగుతున్న ఏపీలో ఇలాంటి వేదిక అవసరాన్ని ప్రాముఖ్యతను గుర్తించిన వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ కు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబధించిన సమాచారం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మరింత వేగంగా అందనుంది. అలాగే ఈ విషయాలపై తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలు ఉపయోగపడనున్నాయని ఏపీడీసీ (Andhra Pradesh Digital Corporation) భావిస్తోంది.
ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్థిస్థాయి వాట్సాప్ ఛాట్‌భోట్ సేవలను కూడా ఏపీడీసీ అందించనుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టి కార్యక్రమాలు,పథకాల సమాచారం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేయడంలో ఏపీడీసీ ప్రారంభించబోయే వాట్సాప్, ఛాట్‌భోట్ సేవలు మరింతగా ఉపయోగపడనున్నాయి. దీనిపై ఏపీడీసీ ఛైర్మెన్, ఎండీ చిన్న వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ గారి ప్రగతిశీల అజెండాను ఏపీ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రఖ్యాత మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు.
ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మాధ్యమాలు ఉండాలన్న ఏపీడీసీ లక్ష్యానికి వేస్తున్న ఈ ముందడుగు ఎంతో సాయపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ గవర్నెర్స్ మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉంది. వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికి తగిన ఇగవర్నెన్స్ పరిష్కారాలు రూపొందించేందుకు మా వాట్సాప్ వ్యాపార వేదిక ద్వారా నిరంతరం పనిచేస్తామని వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ అధిపతి శివనాథ్ ఠుక్రాల్ తెలిపారు.