Cyber Fraud In Andhra Pradesh: డాక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు..డ్రగ్స్ మాఫియా పేరుతో రూ. 2 కోట్లు స్వాహా..
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అమీన్ ఆసుపత్రి వైద్యుడు ఇంతియాజ్‌కు పోలీసు అధికారి ఫొటో కలిగిన నంబరు నుంచి ఐదు నెలల క్రితం ఫోన్ వచ్చింది.
Hyd, Oct 9: ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా డాక్టర్‌నే బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అమీన్ ఆసుపత్రి వైద్యుడు ఇంతియాజ్‌కు పోలీసు అధికారి ఫొటో కలిగిన నంబరు నుంచి ఐదు నెలల క్రితం ఫోన్ వచ్చింది.
తన పేరుపై లండన్ నుంచి డ్రగ్స్ పార్సిల్ వస్తోందని దానిపై కేసు నమోదు చేశామని.. త్వరలోనే అరెస్టు చేస్తామని బెదిరించారు. డ్రగ్స్ మాఫియా వారు నిన్ను హతమార్చాలని ప్లాన్ చేశారని తమ విచారణలో తేలిందని చెప్పి వైద్యుడిని నమ్మించారు. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై వేటు, ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో జారీ
Here's Tweet:
ఆ తర్వాత క్రమక్రమంగా డాక్టర్ నుండి రూ.2 కోట్లు కొట్టేశారు. అస్సాంలో సైబర్ నేరగాడిని అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి రాగా పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు డాక్టర్ ఇంతియాజ్.