Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్లకు ఆగస్టు 27న సెలవు,సెప్టెంబర్ 1న పోలవరంపై సీడబ్ల్యూసీ కీలక భేటీ, కొనసాగుతున్న సీఎం జగన్ విశాఖ పర్యటన

ఈ మేరకు కమిషనర్‌ కె.సురేష్‌కుమార్‌ గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు.

ap-govt-issues-notification-for-implementation-of-english-medium-from-next-year (Photo-Twitter)

రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ నెల 27(నాలుగో శనివారం)ను సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ (education-department) ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్‌ కె.సురేష్‌కుమార్‌ గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13వ తేదీ(రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేశాయి.సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు సెప్టెంబర్‌ ఒకటో తేదీన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఇందులో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరానికి నిధుల విడుదలపై కేంద్ర జల్‌ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇస్తుంది. తర్వాత దీన్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం జల్‌ శక్తి శాఖ పంపుతుంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదించాక నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది.

దమ్ముంటే, మగాళ్లయితే ఇప్పుడు రండి అంటూ చంద్రబాబు సవాల్, సీఎం జగన్, డీజీపీ వచ్చినా సరే అని ఛాలెంజ్, అన్నా క్యాంటీన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

కాగా 2017–18 ధరల ప్రకారం.. కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు రూ.55,656.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2,863 కోట్లను రీయింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం కోసం రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని కోరారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో చెల్లించాలన్నారు.