Andhra Pradesh Election 2024: పిఠాపురంలో నీ సీటుకే దిక్కులేదు, నా కూతురుకు సీటు ఇస్తావా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన ముద్రగడ పద్మానాభం
పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.
Vjy, May 6: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీరియస్ అయ్యారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.
కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?
అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సీటుకే దిక్కులేదు.. ఇక నా కుమార్తె ముద్రగడ క్రాంతికి సీటు ఇస్తారంటా అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో వరుస బదిలీలపై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్ జగన్, ఎన్నికలు సజావుగా సాగుతాయో లేదో అని అనుమానం
తుని వేదికగా జరిగిన వారాహి విజయ యాత్రలో భాగంగా తునిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుమార్తె ముద్రగడ క్రాంతి, ఆమె భర్త చంద్రులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మళ్లీ జరిగే ఎన్నికల్లో తన సోదరి క్రాంతికి టిక్కెట్ ఇస్తానని ప్రకటించారు. అలాగే, తండ్రి ముద్రగడ పద్మనాభం, కుమార్తె ముద్రగడ క్రాంతిలను కలుపుతానని చెప్పారు.
దీనిపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. పవన్‌పై ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ సీటుకే దిక్కు లేదని, తన కుమార్తెకి టిక్కెట్ ఇస్తారంటూ అంటూ ఎద్దేవా చేశారు. భీమవరం, గాజువాకలో పవన్‌ను తన్ని తరిమేశారని, ఇపుడు పిఠాపురంలో కూడా అదే జరగబోతుందని ముద్రగడ అన్నారు. చంద్రబాబు ఎస్టేట్‌లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ కళ్యాణ్ అని సెటైర్ వేశారు. మెగా ఫ్యామిలీ చరిత్ర ఏమిటో పవన్ చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. గురువు చంద్రబాబు ఆజ్ఞ ప్రకారం పవన్ నడుచుకుంటున్నారని విమర్శించారు. పవన్ చెప్పేదంతా సొల్లు అని అన్నారు. కులాలు, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టాలని మీ గురువు చెప్పారా అని పవన్‌ను ముద్రగడ ప్రశ్నించారు.