Cm Jagan (Photo-Video Grab)

Machilipatnam, May 06: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) సంచలన కామెంట్స్ చేశారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారని (Transferring Officials), కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. పేదలకు మంచి చేస్తున్న జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను ఉండకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పారు. కాగా, ఇవాళ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. కాగా, ఈ నెల 11న సాయంత్రం 5గంటలకు ఏపీలో ప్రచార పర్వం ముగుస్తుంది. మే 13న ఎన్నికలు జరుగుతాయి.

 

ఏపీలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై (Rajendranath Reddy) ఈసీ బదిలీ వేటు వేయడంతో ఆయన స్థానంలో కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా నియమితుడైన విషయం తెలిసిందే. అలాగే, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.