AP Election Results 2024: ఏపీలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో, 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ, 164 స్థానాలతో టీడీపీ కూటమి విజయభేరి

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజవకర్గంలో గతంలో కంటే జగన్‌కు మెజార్టీ తగ్గింది. జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైసీపీ కేబినెట్‌లోని మంత్రలంతా ఓటమి పాలయ్యారు.

Andhra Pradesh Election Results 2024

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజవకర్గంలో గతంలో కంటే జగన్‌కు మెజార్టీ తగ్గింది. జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైసీపీ కేబినెట్‌లోని మంత్రలంతా ఓటమి పాలయ్యారు. టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 135 సీట్లు గెలుచుకోగా జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది.

బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌, అంజాద్‌ బాషా, ఉషశ్రీ చరణ్‌, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి ర‌మేశ్ సహా పలువురు కీలక నేతలంతా ఓడిపోయారు.  వైసీపీ గెలిచిన 4 ఎంపీ సీట్లు ఇవే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో..

కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) కి మరోసారి తీరని దెబ్బ తగిలింది. ముచ్చటగా మూడోసారి ఏపీలో ఏ ఒక్క స్థానంలో గెలువలేక పోయింది. వైఎస్‌ షర్మిల (YS Sharmila) తోనైనా పార్టీ పరువు కాపాడుకోవచ్చని భావించినా కాంగ్రెస్‌ అధిష్టానానికి చుక్కెదురయ్యింది . ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలుండగా కాంగ్రెస్‌ వందకు పైగా స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఏ ఒక్క స్థానంలో విజయం సాధించలేకపోయింది.2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏ ఒక్క సీటును దక్కించుకోలేక పోయింది. 2024 ఎన్నికల్లో అవే ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు కంగుతింటున్నారు. ఇక కడప ఎంపీ (Kadapa MP) ) స్థానానికి పోటీ చేసి వైఎస్‌ షర్మిల సైతం ఓటమిపాలు కావడం జీర్ణించుకోలేని విషయం

వైసీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలివే..

పులివెందుల: వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

బద్వేలు: దాసరి సుధ

పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మంత్రాలయం: వె.బాలనాగిరెడ్డి

ఆలూరు: బూసినే విరూపాక్షి

యర్రగొండపాలెం (ఎస్సీ): తాటిపత్రి చంద్రశేఖర్‌

అరకు(ఎస్టీ): రేగం మత్స్యలింగం

పాడేరు (ఎస్టీ): మత్స్యరాస విశ్వేశ్వరరాజు

రాజంపేట: ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి

తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి

దర్శి : బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

శ్రీకాకుళం జిల్లా..

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
పాతపట్నం మామిడి గోవింద రావు రెడ్డి శాంతి మామిడి గోవింద రావు
ఎచ్చెర్ల ఎన్.ఈశ్వర రావు (బీజేపీ) గొర్లె కిరణ్ కుమార్ ఎన్.ఈశ్వర రావు
ఆముదాలవలస కూన రవి కుమార్ తమ్మినేని సీతారాం కూన రవి కుమార్
టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం గొండు శంకర్ ధర్మన ప్రసాదరావు గొండు శంకర్
నరసన్నపేట బగ్గు రమణ మూర్తి ధర్మాన కృష్ణదాస్ రమణ మూర్తి
పలాస గౌతు శిరీష సీదిరి అప్పలరాజు గౌతు శిరీష
ఇచ్ఛాపురం బెందాళం అశోక్ పిరియ విజయ బెందాళం అశోక్

పార్వతీపురం మన్యం జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
పాలకొండ నిమ్మక జయకృష్ణ (జనసేన) విశ్వసరాయి కళావతి నిమ్మక జయకృష్ణ
పార్వతీపురం బోనెల విజయ్ చంద్ర ఆలజంగి జోగారావు బోనెల విజయ్ చంద్ర
సాలూరు గుమ్మడి సంధ్యా రాణి పీడిక రాజన్న దొర గుమ్మడి సంధ్యా రాణి
కురుపాం తోయక జగదీశ్వరి పాముల పుష్పశ్రీవాణి తోయక జగదీశ్వరి

విజయనగరం జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
రాజాం కోండ్రు మురళి డాక్టర్ తాలె రాజేశ్ కోండ్రు మురళి
బొబ్బిలి ఆర్ఎస్‌వీకేకే రంగా రావు (బేబీ నాయన) వెంకట చిన అప్పలనాయుడు బేబీ నాయన
విజయనగరం అదితి గజపతి రాజు కోలగట్ల వీరభద్రస్వామి అదితి గజపతి రాజు
శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి కాడుబండి శ్రీనివాసరావు కోళ్ల లలిత కుమారి
చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణ కిమిడి కళా వెంకట్రావు
గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ బొత్స అప్పల నర్సయ్య కొండపల్లి శ్రీనివాస్
నెల్లిమర్ల లోకం మాధవి (జనసేన) బి.అప్పల నాయుడు లోకం మాధవి

విశాఖపట్నం జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు (బీజేపీ) కె.కె.రాజు విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు (గణబాబు) అడారి ఆనంద్ కుమార్ గణబాబు
విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (జనసేన) వాసుపల్లి గణేష్ కుమార్ వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు ఎంవీవీ సత్యనారాయణ వెలగపూడి రామకృష్ణ బాబు
భీమిలి గంటా శ్రీనివాసరావు అవంతి (ముత్తంశెట్టి) శ్రీనివాస్ గంటా శ్రీనివాసరావు
గాజువాక పల్లా శ్రీనివాసరావు గుడివాడ అమర్‌నాథ్ పల్లా శ్రీనివాసరావు
పెందుర్తి పంచకర్ల రమేశ్ బాబు (జనసేన) అన్నంరెడ్డి అదీప్ రాజు పంచకర్ల రమేశ్ బాబు

అల్లూరి సీతారామరాజు జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
పాడేరు గిడ్డి ఈశ్వరి ఎం.విశ్వేశ్వరరాజు ఎం.విశ్వేశ్వరరాజు
అరకు పంగి రాజారావు (బీజేపీ) రేగం మత్స్యలింగం రేగం మత్స్యలింగం
రంపచోడవరం మిర్యాల శిరీష నాగులపల్లి ధనలక్ష్మీ మిర్యాల శిరీష

అనకాపల్లి జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
పాయకరావుపేట వంగలపూడి అనిత కంబాల జోగులు వంగలపూడి అనిత
నర్సీపట్నం చింతకాయల అయ్యనపాత్రుడు పి.ఉమాశంకర్ గణేష్ అయ్యనపాత్రుడు
చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు కరణం ధర్మశ్రీ కేఎస్ఎన్ఎస్ రాజు
యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ రమణమూర్తి రాజు విజయ్ కుమార్
మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి అనురాధ సత్యనారాయణ మూర్తి
అనకాపల్లి కొణతాల రామకృష్ణ మలసాల భరత్ కొణతాల రామకృష్ణ

కాకినాడ జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ వరుపుల సుబ్బారావు వరుపుల సత్యప్రభ
తుని యనమల దివ్య దాడిశెట్టి రాజా యనమల దివ్య
పిఠాపురం పవన్ కళ్యాణ్ (జనసేన) వంగా గీత పవన్ కళ్యాణ్
పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప దావులూరి దొరబాబు చినరాజప్ప
జగ్గంపేట జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) తోట నరసింహం జ్యోతుల నెహ్రూ
కాకినాడ రూరల్ పంతం నానాజీ (జనసేన) కురసాల కన్నబాబు పంతం నానాజీ
కాకినాడ అర్బన్ వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వనమాడి వెంకటేశ్వర రావు

తూర్పుగోదావరి జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
రాజానగరం బత్తుల రామకృష్ణ జక్కంపూడి రాజా బత్తుల రామకృష్ణ
రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ) సత్తి సూర్యనారాయణరెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ)
రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు మార్గాని భరత్ ఆదిరెడ్డి వాసు
గోపాలపట్నం మద్దిపాటి వెంకటరాజు తానేటి వనిత మద్దిపాటి వెంకటరాజు
కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు తలారి వెంకట్రావు ముప్పిడి వెంకటేశ్వరరావు
నిడదవోలు కందుల దుర్గేష్ (జనసేన) జి. శ్రీనివాస నాయుడు కందుల దుర్గేష్ (జనసేన)

కోనసీమ జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
పి. గన్నవరం గిడ్డి సత్యనారాయణ (జనసేన) విప్పర్తి వేణుగోపాల్ గిడ్డి సత్యనారాయణ
అమలాపురం అయితాబత్తుల ఆనందరావు పి. విశ్వరూప్ అయితాబత్తుల ఆనందరావు
రాజోలు దేవ వరప్రసాద్ (జనసేన) గొల్లపల్లి సూర్యారావు దేవ వరప్రసాద్
ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దాట్ల సుబ్బరాజు
కొత్తపేట బండారు సత్యానందరావు చిర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానందరావు
రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ పిల్లి సూర్యప్రకాష్ వాసంశెట్టి సుభాష్
మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు తోట త్రిమూర్తులు వేగుళ్ల జోగేశ్వరరావు

ఏలూరు జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
చింతలపూడి సోంగ రోషన్‌ కంభం విజయరాజు సోంగా రోషన్
దెందులూరు చింతమనేని ప్రభాకర్‌ కొఠారు అబ్యయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్
పోలవరం చిర్రి బాలరాజు (జనసేన) తెల్లం రాజ్యలక్ష్మి చిర్రి బాలరాజు
ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు (జనసేన) పుప్పాల వాసు బాబు పత్సమట్ల ధర్మరాజు
ఏలూరు బడేటి రాధాకృష్ణ ఆళ్ల నాని బడేటి రాధాకృష్ణ
నూజివీడు కొలుసు పార్థసారథి మేకా వెంకట ప్రతాప అప్పారావు కొలుసు పార్థసారథి
కైకలూరు కామినేని శ్రీనివాసరావు ( బీజేపీ) దూలం నాగేశ్వర రావు కామినేని శ్రీనివాస్

పశ్చిమగోదావరి జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
ఆచంట పితాని సత్యనారాయణ సీహెచ్‌ శ్రీరంగనాథ్‌ రాజు పితాని సత్యనారాయణ
పాలకొల్లు నిమ్మల రామానాయుడు గుడాల శ్రీహరి గోపాలరావు నిమ్మల రామానాయుడు
తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్‌ ( జనసేన) కొట్టు సత్యన్నారాయణ బొలిశెట్టి శ్రీనివాస్‌
నర్సాపురం బొమ్మిడి నాయకర్‌ ( జనసేన) ముదునూరి ప్రసాదరాజు బొమ్మిడి నాయకర్
తణుకు అరిమిల్లి రాధాకృష్ణ కారుమూరి నాగేశ్వరరావు అరిమిల్లి రాధాకృష్ణ
భీమవరం పులపర్తి రామాంజనేయులు (జనసేన) గ్రంధి శ్రీనివాస్‌ పులపర్తి రామాంజనేయులు
ఉండి రఘురామకృష్ణరాజు పి.వి.ఎల్‌. నర్సింహరాజు రఘురామకృష్ణరాజు

ఎన్టీఆర్ జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
తిరువూరు కొలికపూడి శ్రీనివాస్‌ నల్లగట్ల స్వామి దాస్‌ కొలికపూడి శ్రీనివాస్‌
నందిగామ తంగిరాల సౌమ్య మొండితోక జగన్నోహన్‌ రావు తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య సామినేని ఉదయ భాను శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్‌ సర్నాల తిరుపతిరావు వసంత వెంకట కృష్ణప్రసాద్‌
విజయవాడ పశ్చిమం సుజనా చౌదరి ( బీజేపీ) షేక్ ఆసిఫ్ సుజనా చౌదరి
విజయవాడ సెంట్రల్‌ బోండా ఉమామహేశ్వరరావు వెల్లంపల్లి శ్రీనివాసరావు బోండా ఉమా
విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన రావు దేవినేని అవినాష్‌ గద్దె రామ్మోహన రావు

కృష్ణా జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
పామర్రు వర్ల కుమార రాజ కైలే అనిల్‌ కుమార్‌ వర్ల కుమార రాజ
గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ మోహన్ యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ వెనిగండ్ల రాము కొడాలి నాని వెనిగండ్ల రాము
అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ ( జనసేన) సింహద్రి రమేష్‌ బాబు మండలి బుద్ధప్రసాద్
పెనమలూరు బోడె ప్రసాద్‌ జోగి రమేష్‌ బోడె ప్రసాద్‌
పెడన కాగిత కృష్ణ ప్రసాద్‌ ఉప్పల రాము కాగిత కృష్ణ ప్రసాద్‌
మచిలీపట్నం కొల్లు రవీంద్ర పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) కొల్లు రవీంద్ర

పల్నాడు జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ నంబూరి శంకర్‌రావు భాష్యం ప్రవీణ్
సత్తెనపల్లి కన్నా లక్ష్మినారాయణ అంబటి రాంబాబు కన్నా లక్ష్మినారాయణ
చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు కావటి మనోహర్‌ నాయుడు ప్రత్తిపాటి పుల్లారావు
వినుకొండ జీవీ ఆంజనేయులు బొల్లా బ్రహ్మ నాయుడు జీవీ ఆంజనేయులు
నరసరావుపేట చదలవాడ అరవిందబాబు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చదలవాడ అరవిందబాబు
గురజాల యరపతినేని శ్రీనివాసరావు కాసు మహేష్ రెడ్డి యరపతినేని శ్రీనివాసరావు
మాచెర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జూలకంటి బ్రహ్మానందరెడ్డి

గుంటూరు జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
తాడికొండ తెనాలి శ్రవణ్‌ కుమార్‌ మేకపాటి సుచరిత తెనాలి శ్రవణ్‌ కుమార్‌
ప్రత్తిపాడు బూర్ల రామాంజినేయులు బాలసాని కిరణ్ కుమార్‌ బూర్ల రామాంజినేయులు
మంగళగిరి నారా లోకేశ్‌ మురుగుడు లావణ్య నారా లోకేశ్‌
పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర అంబటి మురళి ధూళిపాళ్ల నరేంద్ర
తెనాలి నాదెండ్ల మనోహర్ (జనసేన) అన్నాబత్తుని శివకుమార్‌ నాదెండ్ల మనోహర్
గుంటూరు ఈస్ట్ మహ్మద్‌ నజీర్‌ షేక్‌ నూరి ఫాతిమా మహ్మద్‌ నజీర్‌
గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి విడదల రజిని పిడుగురాళ్ల మాధవి

బాపట్ల జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
వేమూరు నక్కా ఆనంద్‌బాబు వరికూటి అశోక్‌ కుమార్ నక్కా ఆనంద్‌బాబు
బాపట్ల వి.నరేంద్ర వర్మ కోన రఘుపతి వి.నరేంద్ర వర్మ
రేపల్లె అనగాని సత్యప్రసాద్‌ డా. ఈవూరు గణేష్‌ అనగాని సత్యప్రసాద్‌
అద్దంకి గొట్టిపాటి రవికుమార్‌ పాణెం చిన హనిమిరెడ్డి గొట్టిపాటి రవికుమార్‌
పర్చూరు ఏలూరి సాంబశివరావు ఎడం బాలాజీ ఏలూరి సాంబశివరావు
చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌ కరణం వెంకటేశ్‌ మాలకొండయ్య

ప్రకాశం జిల్లా

నియోజకవర్గం టీడీపీ వైఎస్సార్సీపీ విజేత
సంతనూతలపాడు బీఎన్ విజయ్‌కుమార్‌ మేరుగు నాగార్జున బీఎన్ విజయ్‌కుమార్‌
కొండపి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదిమూలపు సురేష్‌ బాల వీరాంజనేయస్వామి
ఎర్రగొండపాలెం గూడూరి ఎరిక్సన్‌ బాబు తాటిపర్తి చంద్రశేఖర్‌ తాటిపర్తి చంద్రశేఖర్‌
దర్శి గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
మార్కాపురం కందుల నారాయణ రెడ్డి అన్నా రాంబాబు కందుల నారాయణ రెడ్డి
కనిగిరి దద్దాల నారాయణ యాదవ్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి దద్దాల నారాయణ
ఒంగోలు దామచర్ల జనార్దనరావు బాలినేని శ్రీనివాస రెడ్డి దామచర్ల జనార్దనరావు
గిద్దలూరు అశోక్‌ రెడ్డి కె. నాగార్జున రెడ్డి అశోక్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఇంటూరి నాగేశ్వరరావు
సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సోమిరెడ్డి
కావలి కావ్య కృష్ణారెడ్డి రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి
కోవూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి
ఆత్మకూరు ఆనం రాంనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆనం రాంనారాయణ రెడ్డి
ఉదయగిరి కాకర్ల సురేశ్‌ మేకపాటి రాజ్‌గోపాల్‌ రెడ్డి కాకర్ల సురేశ్‌
నెల్లూరు రూరల్‌ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు అర్బన్‌ పొంగూరు నారాయణ ఎం.డి. ఖలీల్‌ అహ్మద్‌ పొంగూరు నారాయణ

కర్నూలు జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
కోడుమూరు బొగ్గుల దస్తగిరి ఆదిమూలపు సతీష్ బొగ్గుల దస్తగిరి
ఆలూరు వీరభద్ర గౌడ్ బి. విరూపాక్షి బి. విరూపాక్షి
ఎమ్మిగనూరు జయనాగేశ్వర రెడ్డి బుట్టా రేణుక జయనాగేశ్వర రెడ్డి
ఆదోని పీ.వీ పార్థసారథి (బీజేపీ) వై. సాయిప్రసాద్‌ రెడ్డి పీ.వీ పార్థసారథి
కర్నూలు టీజీ భరత్‌ ఎం.డి. ఇంతియాజ్‌ టీజీ భరత్‌
పత్తికొండ కేఈ శ్యాంబాబు కంగాటి శ్రీదేవి కేఈ శ్యాంబాబు
మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి వై. బాలనాగిరెడ్డి వై. బాలనాగిరెడ్డి

నంద్యాల జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
నందికొట్కూరు గిత్తా జయసూర్య దారా సుధీర్‌ గిత్తా జయసూర్య
ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ గంగుల బ్రిజేంద్ర రెడ్డి భూమా అఖిలప్రియ
శ్రీశైలం బుడ్డా రాజశేఖర్‌రెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
బనగానపల్లె బీసీ జనార్దనరెడ్డి కాటసాని రామిరెడ్డి బీసీ జనార్దనరెడ్డి
పాణ్యం గౌరు చరితా రెడ్డి కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి గౌరు చరితా రెడ్డి
నంద్యాల ఎన్‌ఎండీ ఫరూక్‌ శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డి ఎన్‌ఎండీ ఫరూక్‌
డోన్ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
మడకశిర ఎంఎస్ రాజు ఈర లక్కప్ప ఎంఎస్ రాజు
పెనుకొండ కురుబ సవిత కె.వి. ఉషశ్రీ చరణ్‌ కురుబ సవిత
హిందూపురం నందమూరి బాలకృష్ణ టి.ఎన్‌. దీపిక నందమూరి బాలకృష్ణ
పుట్టపర్తి పల్లె సింధూరా రెడ్డి దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పల్లె సింధూరా రెడ్డి
ధర్మవరం వై. సత్యకుమార్ (బీజేపీ) కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి వై. సత్యకుమార్
కదిరి కందికుంట వెంకటప్రసాద్ మక్బూల్‌ అహ్మద్‌ కందికుంట వెంకటప్రసాద్

అనంతపురం జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
శింగనమల బండారు శ్రావణి శ్రీ మన్నెపాకుల వీరాంజనేయులు బండారు శ్రావణి శ్రీ
కల్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు తలారి రంగయ్య అమిలినేని సురేంద్రబాబు
ఉరవకొండ పయ్యావుల కేశవ్‌ వై. విశ్వేశ్వర రెడ్డి పయ్యావుల కేశవ్‌
రాప్తాడు పరిటాల సునీత తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పరిటాల సునీత
తాడిపత్రి జేసీ అస్మిత్‌ రెడ్డి కేతిరెడ్డి పెద్దా రెడ్డి జేసీ అస్మిత్‌ రెడ్డి
గుంతకల్లు గుమ్మనూరు జయరాం వై. వెంకట రామిరెడ్డి గుమ్మనూరు జయరాం
రాయదుర్గం కాలవ శ్రీనివాసులు మెట్టు గోవింద రెడ్డి కాలవ శ్రీనివాసులు
అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంత వెంకటరామి రెడ్డి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

వైఎస్ఆర్ కడప జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
బద్వేలు బొజ్జా రోషన్న (బీజేపీ) డాక్టర్‌ దాసరి సుధ డాక్టర్‌ దాసరి సుధ
మైదుకూరు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఎస్‌. రఘురామి రెడ్డి పుట్టా సుధాకర్‌
కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి పి. రవీంద్రనాథ్‌ రెడ్డి పుత్తా చైతన్య రెడ్డి
జమ్మలమడుగు సి. ఆదినారాయణరెడ్డి (బీజేపీ) ఎం. సుధీర్‌ రెడ్డి సి. ఆదినారాయణరెడ్డి
పులివెందుల బీటెక్ రవి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి
ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి వరదరాజుల రెడ్డి
కడప మాధవి రెడ్డి అంజాద్‌ బాషా మాధవి రెడ్డి

అన్నమయ్య జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్సీపీ విజేత
రైల్వేకోడూర్ అరవ శ్రీధర్ (జనసేన) కె. శ్రీనివాసులు అరవ శ్రీధర్
రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి
రాయచోటి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి రాంప్రసాద్‌రెడ్డి
పీలేరు నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి
మదనపల్లె షాజహాన్ బాషా నిస్సార్‌ అహ్మద్‌ షాజహాన్ బాషా
తంబళ్లపల్లె కె. జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి

తిరుపతి జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
సూళ్లూరుపేట నెలవేల విజయశ్రీ కిలివేటి సంజీవయ్య నెలవేల విజయశ్రీ
గూడూరు పాశం సునీల్‌కుమార్‌ మెరిగ మురళీధర్‌ సునీల్‌కుమార్‌
వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీసాయిప్రియ నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి లక్ష్మీసాయిప్రియ
సత్యవేడు కోనేటి ఆదిమూలం నూకతోటి రాజేష్‌ కోనేటి ఆదిమూలం
శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూదన్‌ రెడ్డి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
చంద్రగిరి పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని) చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పులివర్తి నాని
తిరుపతి ఆరణి శ్రీనివాసులు ( జనసేన) భూమన అభినయ్‌ రెడ్డి ఆరణి శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా

నియోజకవర్గం టీడీపీ కూటమి వైఎస్సార్‌సీపీ విజేత
గంగాధర నెల్లూరు డాక్టర్‌ వీఎం. థామస్‌ కృపా లక్ష్మీ డాక్టర్‌ వీఎం. థామస్‌
పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ డాక్టర్ కలికిరి మురళీ మోహన్
నగరి గాలి భానుప్రకాశ్‌ ఆర్‌కే రోజా గాలి భానుప్రకాశ్‌
చిత్తూరు గురజాల జగన్‌ మోహన్‌ ఎం. విజయానందరెడ్డి గురజాల జగన్‌ మోహన్‌
పలమనేరు ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి ఎన్‌. వెంకటే గౌడ ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి
పుంగనూరు చల్లా రామచంద్రా రెడ్డి (బాబు) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కుప్పం నారా చంద్రబాబు నాయుడు కే జే భరత్‌ నారా చంద్రబాబు నాయుడు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Mystery Illness in Congo: ఆ దేశాన్ని వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి, ఇప్పటికే 50 మందికి పైగా మృతి, వందల్లో బాధితులతో నిండిన ఆస్పత్రులు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్‌, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు

Share Now