Chandrababu Slams CM YS Jagan: టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, జగన్ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా అంటూ ఎద్దేవా
టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.
Vjy, Feb 28: తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో ఏపీ ముఖ్యమంత్రిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ (Chandrababu Slams CM YS Jagan) అయ్యారు. టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి. ఆంధ్రప్రదేశ్ ఇక అన్‌స్టాపబుల్. రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్‌స్టాప్ పడుతుంది.టీడీపీ - జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీది చీటింగ్ టీమ్. టీడీపీ అగ్నికి పవన్ వాయువులా తోడయ్యారు. ఈ సభ చూశాక మా గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమైంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. కూటమిలో ఎవరు ఎక్కువ.. తక్కువ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తున్నామన్నారు.
వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం. వైసీపీ దొంగలపై టీడీపీ-జనసేన పోరాడాలి. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలి. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం.
కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉంది. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు.. జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చింది. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్‌మీడియాలో వేధించారు. జగన్ మానసిక స్థితికి (Chandrababu Slams CM YS jagan Mohan Reddy)ఈ ఘటనలే నిదర్శనం. అందుకే, వైసీపీను చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని చంద్రబాబు తెలిపారు.
జగన్.. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా? కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారు. ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది. జగన్ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా? టీడీపీ-జనసేన కూటమి సూపర్‌హిట్. వైనాట్ 175 కాదు.. వైనాట్ పులివెందుల? రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూప్రింట్ ఉంది. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం. ఇక ఏపీ అన్‌స్టాపబుల్. కూటమి వల్ల కొందరు నేతలు ఇబ్బంది పడి ఉండొచ్చు.. కానీ, పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తాం’’అని చంద్రబాబు అన్నారు.