Chandrababu and Jagan and Pawan Kalyan (Photo-FB)

Vjy, Feb 28: తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్‌ కళ్యాణ్ సీఎం జగన్ మీద నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది.. మన విజయానికి స్ఫూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు.  వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ బరిలో కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఉంటారని వెల్లడి

పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నా. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించింది. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కాదు. కార్యకర్తలారా వ్యూహం నాకు వదలండి.. నన్ను నమ్మండి. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే. అంకెలు లెక్కపట్టవద్దని విపక్షాలకు చెప్పండి. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నా.. కోట కూడా కడతాం. జగన్‌ తాడేపల్లి కోట కూడా బద్దలుకొడతాం. సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు.. యుద్ధం చేసే వాళ్లు కావాలని మండిపడ్డారు.

Here's Videos

జగన్‌.. ఇప్పటి వరకు నా తాలూకా శాంతినే చూశావు.. ఇప్పుడు యుద్ధం చూస్తావ్‌. 4 దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది. అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం. నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయని అన్నారు. టీడీపీ-జనసేన గెలవాలి.. జగన్‌ పోవాలి. ఈ కూటమి విజయం సాధించాలని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నా’’అని పవన్‌ అన్నారు.