Gudivada Memantha Siddham Sabha: ఒక్క సీటు కూడా తగ్గకూడదు, 200కి 200 కొట్టాల్సిందే, గాయం తర్వాత గుడివాడ మేమంతా సిద్ధం సభలో గర్జించిన సీఎం జగన్

గుడివాడలో సీఎం జగన్ మాట్లాడారు. మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Gudivada Memantha Siddham Sabha:

Highlights of CM Jagan's speech at Gudivada Memantha Saaraap Sabha: మేమంతా సిద్ధం 15వ రోజు కృష్ణా జిల్లాలో కొనసాగింది. గుడివాడలో సీఎం జగన్ మాట్లాడారు. మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 2014లో చంద్రబాబు అండ్‌ కో కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండని సీఎం జగన్ అన్నారు. ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వా-తాతలకు, ప్రతీ ఒక్కరికీ మీ బిడ్డ హృదయ పూర్వకంగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.

పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలన్నీ కొనసాగించేందుకు, ప్రతీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, పెత్తందార్లపై యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్‌.చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున..ఒక్క మీ జగన్‌ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్‌.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు.కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్‌ మీద.  సీఎం జగన్‌పై రాయి దాడి, నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 2 లక్షలు నగదు బహుమతి ప్రకటించిన ఏపీ పోలీసులు

మీకు మంచి చేసిన మీ జగన్‌ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు.కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ.చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు.జగన్‌ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు.ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదని సీఎం జగన్ అన్నారు.

నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు అని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదున్నారు. గాయం తర్వాత సీఎం జగన్ లేటెస్ట్ వీడియో ఇదిగో, గన్నవరంలో పార్టీ నేతలతో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి, నేడు గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభ

మీ జగన్‌పై చంద్రబాబు అండ్‌ కో దాడి చేస్తోంది.రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే.కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే.ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే.గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే.పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు..

అది కూడా ఈ బాబే.తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే.విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే.ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే.ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే.చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్‌ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్‌ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబేనని సీఎం జగన్ మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు కూటమి చరిత్రను కూడా ప్రతీ ఇంటికి వెళ్లి వివరించండి. అలా ఆలోచన చేసి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుందనే విషయం గుర్తు పెట్టుకోండి.ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయనే ఆలోచన చేయండి.అందుకే మళ్లీ చెబుతున్నా.. ఈ ఎన్నికల్లో ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. రాబోయే ఐదేళ్లలో మీ భవిష్యత్‌ను నిర్ణయించేవే ఈ ఎన్నికలు.మరి ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా.. వద్దా..అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 99శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది. అభివ‌ృద్ధి చేశాం కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది. మరి వారి జెండా నలుగురితో జత కట్టినా ఎగరలేక కింద పడుతోంది.వరుసగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా వస్తున్నామంటే మీ జగన్‌ కారణమని అన్నారు. ప్రణాళిక బద్ధంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయంటే మీ జగన్‌.మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు, 10 ఇండస్ట్రీయల్‌ నోట్స్‌ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్‌. కొత్త భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు వాయువేగంతో జరుగుతున్నాయంటే మీ జగన్‌ కారణమన్నారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు

Railway Shock To Reel Creators: రీల్స్ క్రియేట‌ర్ల‌కు రైల్వే శాఖ బిగ్ షాక్! ఇక‌పై ట్రైన్లు, రైల్వే ట్రాక్స్, స్టేష‌న్ల‌లో రీల్స్ చేస్తే నేరుగా ఎఫ్ఐఆర్ న‌మోదు

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం