IPL Auction 2025 Live

Vemireddy Prabhakar Reddy Resigns YSRCP: వైసీపీతో పాటు ఎంపీ పదవికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటన

ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా (Vemireddy Prabhakar Reddy Resigns YSRCP) చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Vemireddy Prabhakar Reddy Resigns YSRCP (photo-Facebook)

Nellore,  Feb 21: నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా (Vemireddy Prabhakar Reddy Resigns YSRCP) చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు పంపారు. దీన్ని తక్షణమే ఆమోదించాలని కోరారు.రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి పేర్కొన్నారు.

వీడియో ఇదిగో, ఆర్కేని ఆత్మీయంగా కౌగిలించుకున్న సీఎం జగన్, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు పనిచేస్తానని హామీ

వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన గతంలో ప్రకటన చేశారు. తాజాగా ఆయన పార్టీని వీడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎం.డి.ఖలీల్‌ను నియమించిన విషయంలో ఆయన మనస్థాపానికి గురైనట్లు సమాచారం.