మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆర్కే మాట్లాడుతూ.. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలని కోరారు.
మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి, వైసీపీలో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడి
Here's Video
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే). pic.twitter.com/EHgub9kJBy
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)