Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు
ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 6.00 గంటల కల్లా క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు. నాలుగో దశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు, బెంగాల్‌లో అత్యధికంగా 76 శాతంపైగా పోలింగ్
ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. 275 బీయూలు, 217 సీయూలు, 600 వీవీప్యాట్‌లకు సంబంధించి సమస్యలు తలెత్తాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 20వేల యంత్రాలు అదనంగా ఉంచాం. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ నుంచి ముందే సమాచారం అందింది. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలపై సమాచారం ఉంది. అందుకే, ముందుగానే తగిన ఏర్పాట్లు చేశాం. మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయి. ఇంజినీర్లు యంత్రాలను పరిశీలించి.. డేటా వస్తుందని చెప్పారు. ఇదే నియోజకవర్గంలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు
11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎక్కడా రీ పొలింగ్ అవసరం పడలేదు. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. స్ట్రాంగ్ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుందని ఎంకే మీనా వెల్లడించారు.రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సాయంత్రం 4.00 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5.00 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని వివరించారు.
ఆ నియోజకవర్గాల్లో క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ఇతర నియోజకవర్గాల్లో సాయంత్రం 6.00 గంటలకల్లా క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.
సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 71 లక్షలకు పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1.30 కోట్లకు పైగా పురుషులు ఉండగా, 1.40 కోట్లకు పైగా మహిళలు ఉన్నట్లు తేలింది. పురుషులతో పోలిస్తే.. మహిళలే ఈ పోలింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నారు. తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తాం’’ అని ఎంకే మీనా తెలిపారు.ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. రాత్రి 10గంటలకు పోలింగ్ పూర్తయ్యే అవకాశముందన్నారు.