Andhra Pradesh Elections 2024: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు
టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు చేసింది.
నిన్న జరిగిన ఎన్నికల్లో ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై ఆయన తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. వీడియోలు ఇవిగో, రణరంగంలా మారిన పల్నాడు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంబటి రాంబాబు మండిపాటు, ఈసీకీ ఫిర్యాదు
పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు వైసీపీ నేతలు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు. చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.