ఏపీ ఎన్నికల వేళ నరసరావుపేట (Narasaraopet)లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు (YCP Leaders) ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.ఈ నేపథ్యంలో నరసరావుపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా సాగిన పోలింగ్.. సాయంత్రమయ్యేసరికి పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో మంగళవారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. వీడియో ఇదిగో, గన్నవరంలో చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు
కొత్తగణేషునిపాడులో సోమవారం సాయంత్రం.. టీడీపీ, వైసీపీ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయి నాటుబాంబులతో దాడి చేసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకూ ఈ గొడవలు కొనసాగాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టినప్పటికీ.. సోమవారం రాత్రంతా కొత్తగణేషుడిపాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో వైసీపీ వర్గానికి చెందిన కొంతమంది రాత్రంతా పోలీసుల భద్రత మధ్యన గుడిలోనే ఉన్నట్లు తెలిసింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దుండుగుల దాడి, పరిస్థితి అదుపులోనే ఉంది, నిందితులను అరెస్టు చేస్తామని తెలిపిన ఎస్పీ
మంగళవారం ఉదయం వైసీపీ నేతలు కాసు బ్రహ్మానందరెడ్డి, అనిల్ కుమార్ ఘటనాస్థలికి చేరుకోవటంతో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రత్యర్థి వర్గం వైసీపీ నేతల కాన్వాయిమీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరోసారి చేయిదాటడంతో కేంద్ర బలగాలు జోక్యం చేసుకున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం వైసీపీ నేతలను అక్కడి నుంచి తరలించారు.
Here's Videos
ఏపీ పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన విధ్వంసం pic.twitter.com/keknCr0nd7
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2024
ఎన్నికలు అయిపోయినా ఆగని దాడులు
గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం ఘంటావారిపాలెంలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు. pic.twitter.com/4ogIMpt6ks
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2024
పల్నాడు జిల్లా - నిన్న జరిగిన గొడవలలో గాయపడిన వారితో నిండిపోయిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి. pic.twitter.com/j6a28oT2KB
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2024
రణరంగం గా మారిన కారంపూడి
గుంటూరు జిల్లా కారంపూడిలోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద వైసీపీ టిడిపి నేతల మధ్య ఘర్షణలు. pic.twitter.com/UB3jO2iCp5
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2024
A car set on fire and tdp party office vandalised by YSRCP activists at Karampudi under Gurajala constituency in Palnadu district in AP#APElection2024 #Violence #TDP #YSRCongress pic.twitter.com/qv9RhvE6ar
— Sudhakar Udumula (@sudhakarudumula) May 14, 2024
పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని... పిన్నెల్లి, ఆయన కుమారుడిపై దాడి చేశారని అన్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. వైసీపీకి మద్దతుగా ఉన్న గ్రామాలపై దాడి చేశారని తెలిపారు.
Here's Anil Kumar Statement
వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సంకేతాలు వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారు
మాచర్లలో టీడీపీ గూండాలు బరితెగించి విధ్వంసం సృష్టించారు..దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదు..వాళ్లే అభ్యర్థుల్లా వ్యవహరించారు
-నరసరావుపేట ఎంపీ… pic.twitter.com/NDn4iBDewl
— YSR Congress Party (@YSRCParty) May 14, 2024
పల్నాడు జిల్లా కొత్తగణేసునిపాడులో పోలింగ్ పూర్తయినా ఆగని టీడీపీ అరాచకాలు
వైయస్ఆర్సీపీకి ఓటేసిన బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టించిన టీడీపీ గూండాలు
మహిళలపై దాడులు జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్… pic.twitter.com/5tlL1MR46j
— YSR Congress Party (@YSRCParty) May 14, 2024
Ambati Rambabu Statement
పోలింగ్ కేంద్రాలకు వృద్ధులు, వికలాంగులు, మహిళలు భారీగా తరలిరావడం చూస్తే సీఎం వైయస్ జగన్ మరోసారి గెలవడం ఖాయం.
నా నియోజకవర్గంలో పోలీసులు డబ్బులు తీసుకుని అవతలి పార్టీకి అమ్ముడుపోయారు.
దమ్మాలపాడు గ్రామంలో కన్నా వర్గం 1000 దొంగ ఓట్లు వేశారు. అక్కడ రీపోలింగ్ నిర్వహించాలి.… pic.twitter.com/QdhQdWRWOp
— YSR Congress Party (@YSRCParty) May 14, 2024
Gopireddy Statement
పల్నాడు ప్రాంతంలో పోలీసు, రెవెన్యూ అధికారులు టీడీపీ అభ్యర్థులకు కొమ్ముకాశారు.
మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అవే ఈసీ రూల్స్ టీడీపీ అభ్యర్థులకు వర్తించవా?
-నరసరాపుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి#TDPLosing #YSRCPWinningBig pic.twitter.com/TPcRlkwU0p
— YSR Congress Party (@YSRCParty) May 14, 2024
తాము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని... కొందరు పోలీసులు టీడీపీ అనుచరుల్లా వ్యవహరించారని అన్నారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని విమర్శించారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కొందరు పోలీసులు తమకు వ్యతిరేకంగా పని చేశారని విమర్శించారు. తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని... ఈ రూల్స్ టీడీపీ అభ్యర్థులకు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు.
పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.
నార్నేపాడు, దమ్మాలపాడు, చీమల మర్రి గ్రామాల్లోని ఆరు బూత్‌లలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందన్నారు. ఈ ఆరు బూత్‌లలోని పీఓ రిపోర్ట్ కాకుండా వెబ్ కెమెరాలను పరిశీలించాలని కోరారు. ఈ ఆరు బూత్‌లలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.
సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గంలో కనివినీ రీతిలో హింస జరిగిందని ఆరోపించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించ లేదని మండిపడ్డారు. జిల్లా పోలీసు యంత్రాంగం టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యరా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
రాంబాబు అనే రూరల్ ఎస్‌ఐ డబ్బులు తీసుకుని టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలీసుల ఆగడాలపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్నామా? లేమా? అనే దుస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మహిళల ఓటింగ్ శాతం పెరుగడం వల్ల అధికార వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని భావిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వైసీపీ అందించిన ప్రభుత్వ పథకాలను మెచ్చి 70 శాతం మంది మహిళలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని తెలిపారు.