Andhra Pradesh Elections Results 2024: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై వెనక్కి తగ్గిన ఈసీ, ఏపీ సీఈవో జారీ చేసిన మెమో వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు స్పష్టం

ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది

Election Commission (photo-ANI)

Vjy, May 30: ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది. కాగా సీఈఓ ఇచ్చిన మెమోపై వైఎస్సార్‌సీపీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్‌ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం.

పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం చేసి, స్టాంప్‌ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి.  పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వైసీపీ, ఇప్పటికే సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి

అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా ఈనెల 25న ఓ మెమో, 27న మరో మెమో జారీ చేశారు. ఏపీ సీఈఓ ఇచ్చిన మెమోలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్‌ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దు. నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు (స్పెసిమెన్‌) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలి. డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం ఉంటే చాలు!. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ అధికారి సంతకం (స్పెసిమెన్‌)తో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.   మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్, జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఈ మెమో పై వైఎఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఈసీ ప్రకటించింది.

అంతకు ముందు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికలసంఘానికి ఏం చెప్పిందంటే.. ఫాం 13ఏపై అటెస్టేషన్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్‌ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్‌ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారని తెలిపింది.

తాజాగా ఏపీ హైకోర్టుకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది.