Andhra Pradesh Encounter: విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు, ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు, కూంబింగ్ కొనసాగుతోందని తెలిపిన కొయ్యూరు సీఐ వెంకటరమణ
ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి ( Maoists killed in encounter in Vizag)చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
Vizag, June 16: ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం జిల్లా (Vizag Agency) కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి ( Maoists killed in encounter in Vizag)చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఎవరు చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నామన్నారు. ఘటనాస్థలిలో ఏకే- 47, తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
వీరిలో మావోయిస్టు కీలకనేత కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలంనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య తీగలమెట్ట పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.