Andhra Pradesh Fire: అమరావతిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో మాడి మసైపోయిన రాజధాని అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన నిర్మాణ సామగ్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన నిర్మాణ సామగ్రి శుక్రవారం భారీ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది.ఈ ఘటన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో చోటుచేసుకుంది.

Representative image (Photo Credit: Pixabay)

Vjy, April 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన నిర్మాణ సామగ్రి శుక్రవారం భారీ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది.ఈ ఘటన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ పనుల నిమిత్తం బహిరంగ ప్రదేశంలో పడేసిన ప్లాస్టిక్ పైపులు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

నిర్మాణ పనులు ఆగిపోవడంతో గత నాలుగేళ్లుగా మెటీరియల్ అక్కడే పడేయడంతో పైపులైన్లు, ఇతరత్రా వస్తువులలో బీళ్లు ఏర్పడ్డాయి. గత నాలుగేళ్లుగా అదే ప్రాంతంలో పైపులు ఉండటంతో వాటికి తేనెతుట్టెలు పెరిగిపోయాయి. తేనె తీసుకునేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు పొగబెట్టే ప్రయత్నంలో మంటలు పైపులకు అంటుకున్నాయి.

బెజవాడలో బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులకు గాయాలు.. వీడియో

అధిక ఉష్ణోగ్రత, గాలి కారణంగా, మంటలు వ్యాపించాయి. చాలా దూరం నుంచి కూడా భారీ మంటలు, పొగలు కనిపించాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనతో భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాష్ట్రాల రాజధానులుగా నిర్ణయించడంతో అమరావతిలో రాష్ట్ర రాజధాని అభివృద్ధి పనులు 2019లో ఆగిపోయాయి.



సంబంధిత వార్తలు