Amarnath Cloudburst: అమర్‌నాథ్ వరదల్లో గల్లంతైన ఏపీ వాసులు, ఇంకా చిక్కని ఆచూకి, రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం

ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్‌ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు.

Amarnath Cloudburst. (Photo Credits: ANI)

New Delhi, July 10: అమర్‌నాథ్ వరదల్లో (Amarnath Cloudburst) మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్‌ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు. ఇంకా వరదల్లో చిక్కుకున్న యాత్రికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్‌ ప్రయత్నిస్తున్నాయి. MV-17V5 హెలికాప్టర్లతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇక అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి గల్లంతైన ఏపీవాసుల వివరాలు(Five pilgrims from Andhra Pradesh) తెలిశాయి.

వినోద్ అశోక్ (విజయవాడ), గునిసెట్టి సుధ, పార్వతి (రాజమహేంద్రవరం), బి.మధు (తిరుపతి), మేడూరు జాన్సిలక్ష్మి (గుంటూరు), వానపల్లి నాగేంద్ర కుమార్‌లు (విజయనగరం) కనిపించడం లేదని గుర్తించారు. వారి ఆచూకి ఇంకా తెలియలేదు. వారి ఫోన్‌లు స్విచ్చాఫ్‌ కావడంతో ఆచూకీ తెలియట్లేదని అధికారులు తెలిపారు. అమర్నాథ్‌లో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని హిమాన్షు కౌశిక్‌​ తెలిపారు. శ్రీనగర్‌లోని టెంపుల్‌ బోర్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో టచ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో ఏపీ వారు ఎవరూ లేరని పేర్కొన్నారు.

దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు, గత 24 గంటల్లో 42 మంది కరోనాతో మృతి, మరో 1,28,690 కేసులు యాక్టివ్‌

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వారిని రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం చేస్తున్నారు. ఏపీ ప్రయాణికుల భద్రతపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రంగంలోకి దిగారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ కౌశిక్ శ్రీనర్‌కు వెళ్లారు.

అమర్నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు

►ఢిల్లీ ఏపీ భవన్ హెల్ప్ లైన్ నంబర్స్: 011-23384016, 011-23387089

►ఆంధ్ర ప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్: 1902