Bhuma Akhila Priya Arrest: భూమా కుటుంబం-ఏవీ కుటుంబాల మధ్య గొడవేంటి, నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌, అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు

భూమా అఖిలప్రియ దంపతులను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.వీరితో పాటు ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Bhuma Akhila Priya (Photo-Instagram)

Allagadda, May 17: ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియ దంపతులను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.వీరితో పాటు ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం రాత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై.. అఖిల ప్రియ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కిందపడిన ఆయనపై పిడిగుద్దులు కురింపించారు.ఆయన ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీ హైకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి, సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

నంద్యాల మండలం కొత్తపల్లి దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి ఘటనపై నంద్యాల పోలీసులకు ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy) ఫిర్యాదు చేయగా యాక్షన్ తీసుకున్నారు. అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయాన్నే ఆళ్లగడ్డలోని అఖిల ప్రియ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు.అలాగే ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

గొడవకు కారణాలేంటి?

భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే భూమా నాగిరెడ్డి మరణాంతరం ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి మధ్య ఒక్కసారిగా విబేధాలొచ్చాయి. నాటి నుంచి తాను రాజకీయాల్లోకి రావాలని ఏవీ ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు.. అయితే నంద్యాల, లేకుంటే ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని ఏవీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అఖిల ప్రియ వర్సెస్ ఏవీగా పరిస్థితులు మారిపోయాయి.

Video

ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేయడాన్ని కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించిన కేసులు పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే అయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఈ రెండు వర్గాల మధ్య పోరు నివురుగప్పిన నిప్పులా మారింది.

ఈ నేపథ్యంలోరానున్న ఎన్నికల్లో తనకే కచ్చితంగా టికెట్ వస్తుందన్న ధీమాతో సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని లోకేష్ పాదయాత్ర ద్వారా అందరికీ తెలియజేయాలని భావించిన ఏవీ సుబ్బారెడ్డి తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif