Road Cess on Fuel in AP: ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు ఝలక్, పెట్రోల్ మరియు డీజిల్‌పై పన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు అభివృద్ధి పనుల కోసమేనని వెల్లడి
ఇటీవల కాలంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, ఈ సెస్ ద్వారా సమకూరే నిధులను రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.....
Amaravati, September 18: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ మరియు హైస్పీడ్ డీజిల్‌పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఉన్న వ్యాట్ కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై సెస్ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఇకపై పెట్రోల్ మరియు డీజిల్‌పై ప్రతి లీటరుకు 1 రూపాయి చొప్పున అదనంగా ఛార్జ్ చేయనున్నారు.
ఇటీవల కాలంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, ఈ సెస్ ద్వారా సమకూరే నిధులను రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈనెల 3న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతకాలంగా గోప్యత పాటించిన ప్రభుత్వం, ఎట్టకేలకు శుక్రవారం అధికారికంగా జీవో విడుదల చేయడంతో బహిర్గతమైంది.
Here's the update:
కొత్తగా విధించే ఈ రోడ్ డెవలప్‌మెంట్ సెస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 600 కోట్ల మేర ఆదాయం చేకూరవచ్చునని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తాన్ని డీలర్ల నుంచి వసూలు చేయాలని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ పేరిట విడుదలైన ఆడినెన్సులో ప్రభుత్వం పేర్కొంది. ఆర్డినెన్సు విడుదలయిన వెంటనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.