Andhra Pradesh: జగన్ సర్కారు గుడ్ న్యూస్, ఇక నుంచి పింఛన్‌ను ఓ చోటు నుంచి మరొక చోటుకి మార్చుకోవచ్చు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది.

YSR Pension Kanuka

Amaravati, Sep 26:  ఫించన్ దారులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి పింఛన్‌ లబ్ధిదారు సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్‌ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. అలాగే, నిబంధనల ప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్‌ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది.

సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ, మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష

పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం.. పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif