Devineni Uma: దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, వారం రోజుల పాటు జైలులో గడిపిన టీడీపీ నేత

కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును (Andhra Pradesh High Court ) ఆశ్రయించారు.

devineni umamaheswar rao (Photo-Twitter)

Amaravati, August 4: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును (Andhra Pradesh High Court ) ఆశ్రయించారు. దీనిపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమపై (former minister Devineni Uma Maheswara Rao) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్‌ ఏ నేరానికీ పాల్పడలేదని చెప్పారు. ఫిర్యాదుదారుది ఏ సామాజికవర్గమో తెలియదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్థులు అటవీ ప్రాంత సమస్యను దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లటంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

రాజమండ్రి జైలుకు దేవినేని ఉమ, 14 రోజులు రిమాండ్ విధించిన మైలవరం జడ్జి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వైసీపీ నేతపై దాడి చేశారని ఆరోపణలు

కస్టడీ కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. కేసు విచారణ జరుగుతోందని.. మిగిలిన నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వటం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు.. నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సుమారు వారం రోజుల పాటు ఆయన్ను జైల్లోనే ఉంచారు. కొండూరులో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు