Amaravati Padayatra Row: పాదయాత్రలో ముందు రైతులు ఉంటే వెనక వాళ్లెందుకు ఉన్నారు, పాదయాత్ర ద్వారా కోర్టులపైనా ఒత్తిడి తెస్తారా, ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

నేటి విచారణలో భాగంగా పాదయాత్రపై (Amaravati Padayatra Row) ఏపీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.పాదయాత్రలో ముందు రైతులున్నప్పటికీ వెనుక వేరేవాళ్లు ఉన్నారని కోర్టు (High Court) వ్యాఖ్యానించింది.

AP High Court (Photo-Twitter)

VJY, Nov 2: అమరావతి పాదయాత్రపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి విదితమే. నేటి విచారణలో భాగంగా పాదయాత్రపై (Amaravati Padayatra Row) ఏపీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.పాదయాత్రలో ముందు రైతులున్నప్పటికీ వెనుక వేరేవాళ్లు ఉన్నారని కోర్టు (High Court) వ్యాఖ్యానించింది. పాదయాత్ర ద్వారా కోర్టులపైనా ఒత్తిడి తెస్తారా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమరావతి పాదయాత్ర రాజకీయ యాత్రలా ఉందంటూ.. పిటిషన్‌లో అందులో భాగం కాని వారు అప్పీల్‌ ఎలా దాఖలు చేస్తారంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితిని హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై అభ్యంతరం లేవనెత్తిన రాష్ట్ర ప్రభుత్వం.. సవివరంగా కౌంటర్‌ దాఖలు చేస్తామని ధర్మాసనానికి తెలిపింది. దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

అమరావతి రాజధాని కేసులో కీలక మలుపు, విచారణ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు CJI జస్టిస్‌ లలిత్, కేసు వేరే బెంచ్‌కు బదిలీ

అమరావతి పాదయాత్రకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది.ఈ మేరకు అమరావతి పాదయాత్రకు సంబంధించి వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులకు చూపించాలని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పాదయత్రలో పాల్గొనకుండా మరే రకంగా అయినా సంఘీభాం తెలపవచ్చని తెలిపిన కోర్టు.. తమ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని పేర్కొంది.

పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని, ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతుల (farmers)కు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.