IT Notice to Chandrababu: రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నాడని అభియోగాలు, చంద్రబాబుకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ
ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు మీద ఈ నోటీసులు జారీ చేసింది.
Vjy, Sep 1: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు మీద ఈ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం.
హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి ఆయనకు 118 కోట్లు వచ్చాయని.. వాటిపై సరైన సమాచారం ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులను చంద్రబాబు నాయుడుకు జారీ చేసింది. ఈ మొత్తాన్ని "బహిర్గతం కాని ఆదాయం"గా పరిగణించరని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది.
చంద్రబాబు నాయుడు ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించిన తరువాత ఆగస్టు 4న సెంట్రల్ సర్కిల్, హైదరాబాద్ నుండి ఈ నోటీసు జారీ చేశారు. "కేసు ఈ కార్యాలయానికి (సెంట్రల్ సర్కిల్) తెలియజేసిన వెంటనే, విచారణను ప్రారంభించడానికి సెక్షన్ 153C కింద నోటీసు జారీ చేశారు. ప్రొసీడింగ్‌లు పురోగతిలో ఉన్నాయి" అని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
డిపార్ట్‌మెంట్ స్టేట్‌మెంట్‌లను నమోదు చేసి స్వాధీనం చేసుకుంది. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లెక్కల్లో చూపని ఆదాయాన్ని మాజీ సీఎంకు ఇచ్చేశారని ఆదాయపన్ను శాఖ చెబుతోంది. I-T చట్టంలోని సెక్షన్ 153C రెవిన్యూ డిపార్ట్‌మెంట్ ప్రకారం విచారణ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Heres' YSRCP Tweet
Here's Hindustan Times Tweet
షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు ముడుపులు ముట్టాయని సమాచారం. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలుస్తోంది. షాపూర్జీ పలోంజీ & కో. ప్రైవేట్ లిమిటెడ్ (SPCL) తరపున డిసెంబర్ 2017 నుండి ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ ప్రక్రియలో పాల్గొంటున్న మనోజ్ వాసుదేవ్ పార్ధసాని (నోటీస్‌లో MVP గా ప్రస్తావించారు)కి చెందిన ప్రాంగణంలో సోదాలు జరిపారు.
Here's Hindustan Times News
నవంబర్ 2019లో పార్దసాని అసోసియేట్స్ ప్రాంగణంలో సోదాలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుపై I-T దర్యాప్తు ప్రస్తావన వచ్చింది. బూటకపు సబ్-కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా నగదును సంపాదించడానికి, SPCL ద్వారా నిధులను స్వాహా చేయడానికి బోగస్ కాంటాక్ట్‌లు, వర్క్ ఆర్డర్‌లను సృష్టించినట్లు పార్ధసాని అంగీకరించాడని నోటీసుల్లో ఉంది.
“సెర్చ్ ఆపరేషన్ల సమయంలో MVP, అతని సహచరుల నుండి అనేక నేరారోపణ సందేశాలు, చాట్‌లు, ఎక్సెల్ షీట్‌లు కూడా రికవరీ చేశారు, ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ద్వారా నిధులను, నగదుని పక్కదారి పట్టించడాన్ని చూపుతున్నాయి. అటువంటి నగదును మీకు (నాయుడు) పంపించినట్లు తేలింది”అని ఆదాయపన్ను శాఖ నోటీసుల్లో పేర్కొంది.
నోటీసు ప్రకారం, MVP చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పి శ్రీనివాస్‌ను ఆగస్టు 2016లో (నాయుడు CMగా ఉన్నప్పుడు) సంప్రదించారు, శ్రీనివాస్ పార్టీకి నిధుల కోసం ఏర్పాట్లు చేయమని కోరాడు. “01.11.2019 - 05.11.2019 తేదీలలో రికార్డ్ చేసిన MVP స్టేట్‌మెంట్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్‌పికి కేటాయించిన ప్రాజెక్టుల నుండి అసలు ఏ పని చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు కనుగొన్నారు.. షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పి) కాకుండా L&T నుండి నిధులు కూడా స్వాహా చేశారు.
ఫీనిక్స్ ఇన్‌ఫ్రా & పోర్ ట్రేడింగ్ వంటి కంపెనీల ద్వారా మీ ఉపయోగం కోసం నిధులు మళ్లించారు, ”అని చంద్రబాబు నాయుడుకి నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కోసం శ్రీనివాస్‌కు నగదు డెలివరీ చేసినట్లు చూపే అనేక నేరారోపణ సందేశాలు, చాట్‌లు, ఎక్సెల్ షీట్‌లను సెర్చ్ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
ఈ సాక్ష్యాల కారణంగా MVPని అదుపులోకి తీసుకున్నారు. అతను తన వాంగ్మూలాలలో సెర్చ్ సమయంలో రికార్డ్ చేసిన తన స్టేట్‌మెంట్‌లలో బోగస్ కాంట్రాక్టుల ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నుండి వచ్చిన డబ్బును శ్రీనివాస్‌కు డెలివరీ చేసిన మొత్తం విధానాన్ని బయటపెట్టాడు" అని నోటీసులో ఉంది.
ఈ బోగస్ కంపెనీలు, కాంట్రాక్ట్స్ నుండి వచ్చిన డబ్బు ద్వారా అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబు నాయుడు అని I-T శాఖ ఆరోపించింది. “దయచేసి 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ₹118,98,13,2071 రూపాయలు మీ వెల్లడించని ఆదాయంగా ఎలా పరిగణిస్తారో చెప్పండి." అంటూ ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపింది.