Mekapati Goutham Reddy Dies: గుండెపోటుతో మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత, ఇటీవలే కోవిడ్‌ బారిన పడి కోలుకున్న ఏపీ ఐటీశాఖ మంత్రి

గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

IT Minister Mekapati Goutham Reddy (Photo-PTI)

Amaravati, Feb 21: ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం (Mekapati Goutham Reddy Dies) చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని (IT Minister Mekapati Goutham Reddy ) ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు.

కాగా మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వారం రోజులపాటు దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి ఆదివారమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇటీవలే కోవిడ్‌ బారిన పడి కూడా కోలుకున్నారు.

పెళ్లి వేడుకలో ఘోర విషాదం, పెళ్లి కొడుకుతో సహా 9 మంది అక్కడికక్కడే మృతి, ప్రమాదవశాత్తు చంబల్ నదిలో పడిపోయిన కారు

అయితే సోమవారం ఉదయం గుండె పోటు రావడంతో అపోలో ఆ‍స్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. గౌతమ్‌రెడ్డి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌కు బయల్దేరారు.



సంబంధిత వార్తలు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య