Andhra Pradesh: మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థంగా..ఉదయగిరి మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏపీలో రెండవది
నెల్లూరుజిల్లాలోని ఉదయగిరి మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం (Jagan government) తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు.
SPSR Nellore, May 27: నెల్లూరుజిల్లాలోని ఉదయగిరి మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం (Jagan government) తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా యూనివర్సిటీని (Merits Engineering College a University of Agriculture and Horticulture) నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థుల్లో మరింత మక్కువ పెంచేందుకు ప్రభుత్వం నుంచి అడుగులు వేగంగా పడుతున్నాయి.
రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ వర్సిటీ (University of Agriculture and Horticulture) అందుబాటులో ఉంటే అధిక మంది విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరులో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు సుమారు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీకి రాయలసీమ పరిధిలో ఉండే కళాశాలలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెండవ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఇది ఉండనుంది.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మెట్ట ప్రాంత విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మర్రిపాడు మండలంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు సొంత భూములు కేటాయించారు. సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సొంత నిధులు సమకూర్చారు. ఎంఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలకు సొంత నిధులిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. మేకపాటి కుటుంబం ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగించడంతో వారి దాతృత్వానికి మెట్ట ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు.
ఉదయగిరి మెరిట్స్ కళాశాల (Merits Engineering College) 106 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన అకాడమీ బ్లాక్స్, 600 అమ్మాయిలు, 750 అబ్బాయిలుండేలా హాస్టల్ భవవ సదుపాయాలున్నాయి. 89 స్టాఫ్ క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, లైబ్రరీ 27 వేల పుస్తక సముదాయం, మూడు బస్సులు, జనరేటర్స్, క్యాంటీన్, గెస్ట్ హౌస్, ఫిజికల్ డైరెక్టరీస్, ఎన్‌ఎస్‌ఎస్, భవన సముదాయాలు, ప్లే గ్రౌండ్ తదితర ఆస్తులను వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అలాగే సుమారు 50 ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములను కూడా ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. రూ.కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన ఎంఆర్‌ఆర్ ట్రస్ట్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్న వారి విన్నపానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)