Kodali Nani on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై కొడాలి నాని సెటైర్ల వీడియో ఇదిగో, కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించండి అన్న లోకేష్‌ ఎక్కడ అంటూ సెటైర్లు

మేము లోకేష్‌ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించడండి అన్న లోకేష్‌.. ఇప్పుడు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు

Nara Lokesh on Kodali Nani (Photo-Video Grab)

లోకేష్‌ మా పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నాడని.. మేము లోకేష్‌ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించడండి అన్న లోకేష్‌.. ఇప్పుడు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.ఆడెవడో స్టార్‌ వస్తే లోకేష్‌ అన్నయ్య అంటాడు. ఓ పక్కన అన్నయ్యను, మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడు.

 వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్ట్‌తో మాకేమి సంబంధం, ధర్నాలు ఇక్కడ కాకుండా అక్కడే చేసుకోమని చెప్పానని తెలిపిన మంత్రి కేటీఆర్

2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరీ అంటున్నారు. హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా..? తన భర్తక వసతుల్లేవు. వేడి నీళ్లు లేవని భువనేశ్వరి అంటున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు,కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదు. జైలు. జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలని చురకలంటించారు.

Here's Videos

చంద్రబాబు ఏదో అరెస్ట్ అయ్యాడూ.. దానిపై ఎదోటి మాట్లాడమని పక్క రాష్ట్రం నేతలను బ్రతిమాలుతున్నారు. అందుకే కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు.. బాబుతో పాటు జైలుకెళ్తారా..? చంద్రబాబు కోసం ఎవరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు చేస్తారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మ కులస్తులు మాత్రమే. మా వాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయి. పొరుగు దేేశాలు.. రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలేమైనా నిరసనలు చేస్తున్నారా..? చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వలేదు.’ అని కొడాలి నాని పేర్కొన్నారు.