Andhra Pradesh Medical Apathy: స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం, సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడి

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో (Andhra Pradesh Medical Apathy) చిన్నారి మృతదేహంతో ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులు 120కి.మీ. ప్రయాణించారు.

Representational Image (File Photo)

Visakhapatnam, Feb 17: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో (Andhra Pradesh Medical Apathy) చిన్నారి మృతదేహంతో ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులు 120కి.మీ. ప్రయాణించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు, మహేశ్వరి దంపతులకు ఈ నెల 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు.

బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్‌ పిల్లల వార్డుకు రిఫర్‌ చేశారు. అదే రోజున శిశు­వును కేజీహెచ్‌ పిల్లల వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఎన్‌ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందు­తూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విష­యాన్ని వైద్యులు కేజీహెచ్‌లోని గిరిజన సెల్‌ ఇన్‌చార్జి రామకృష్ణకు తెలిపారు.

జయమంగళ వెంకటరమణకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

చిన్నారి మృతదేహం స్వగ్రామానికి తరలించాలని తల్లిదండ్రులు కేజీహెచ్‌ ఎస్టీ సెల్‌ విభాగాన్ని సంప్రదించగా అధికారులు అంబులెన్సు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తల్లిదండ్రులు ద్విచక్రవాహనంపై (Couple Forced To Carry Child’s Body) పాడేరు వరకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. అప్పటికే ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పాడేరు జిల్లా ఆసుపత్రి అంబులెన్సు ఏర్పాటు చేసి, బాధితులను అందులో స్వగ్రామానికి తరలించింది.

 ఏపీలో బీజేపీకి బిగ్ షాక్, రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు

ఇదిలా ఉంటే ఆస్పత్రి వర్గాల కథనం మరోలా ఉంది. శిశువు మృతదేహం తరలింపున­కు వాహనం సిద్ధం చేస్తూండగానే.. తండ్రి ద్విచక్ర వా­హనంపై తీసుకొని వెళ్లినట్టు గిరిజన సెల్‌ ఇన్‌చార్జి రామకృష్ణ..పాడేరు డీఎంహెచ్‌­వో, ఐటీడీఏ పీవోకు సమా­చారమిచ్చారు. ఈ విషయం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. కలెక్టర్‌ ఆదేశా­లతో సిబ్బంది మృత శిశువును తీసుకెళ్తున్న స్కూటీని పాడేరు వద్ద గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో కుముడు గ్రామానికి తరలించారు. కేజీహెచ్‌ సిబ్బంది సరిగా స్పందించనందుకే తామిలా తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు.

ఈ ఘటనపై విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లను సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సాలూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీడీఏ అంబులెన్స్‌కు ఆయిల్‌ పట్టించు­కుని వస్తామని సిబ్బంది తెలిపినప్పటికీ వినకుండా సద­రు వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతోనో వెళ్లిపోయార­న్నారు. అయినప్పటికీ మార్గం మధ్యలో వారిని గుర్తించి, అంబులెన్స్‌లో శిశువు మృతదేహాన్ని తరలించారని తెలి­పారు.

ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా సీఎంకు మానవత్వం లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనులకు మంచి వైద్యం కోసం సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలి­పారు. కాగా, ఈ ఘటనపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ విచారణ చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement