ఏలూరు జిల్లా కైకలూరు మాజీ MLA జయమంగళ వెంకటరమణ లాంఛనంగా వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ఆయన వచ్చారు. జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు. మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం, సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి జయమంగళ వెంకటరమణకు పార్టీలోకి ఆహ్వానం పలికారు. వెంకటరమణను ఆత్మీయంగా హత్తుకుని అభినందనపూర్వకంగా వీపు తట్టారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)