Payyavula Keshav on Jagan: జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేదు, ఆయన ఫ్లోర్ లీడ‌ర్ మాత్రమే, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

Jagan vs payyavul Keshav

Amaravati, June 26: వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మొత్తం స‌భ్యుల్లో ప‌దో వంతు ఉంటేనే ప్ర‌తిప‌క్ష నేత హోదా ఇస్తార‌ని మంత్రి తెలిపారు. జ‌గ‌న్ ఫ్లోర్ లీడ‌ర్ మాత్రమేన‌ని ఆయన పేర్కొన్నారు. సీఎం త‌ర్వాత ప్ర‌తిపక్ష నేత ప్ర‌మాణం చేయాల‌ని జ‌గ‌న్ చెప్ప‌డం హస్యాస్పదంగా ఉంద‌న్నారు.

జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేనందున ముఖ్య‌మంత్రి త‌ర్వాత మంత్రులు ప్ర‌మాణం చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మ‌రోలా జ‌గ‌న్ మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉంటే క్యాబినేట్ హోదా వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని తెలిపారు. అలాగే 1984లో ఉపేంద‌ర్‌కు ప్ర‌తిప‌క్ష నేత హోదా ఇవ్వ‌లేద‌న్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదా పొంద‌డానికి ప‌దేళ్లు ప‌ట్టింద‌ని మంత్రి ప‌య్యావుల చెప్పుకొచ్చారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్‌ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు జగన్‌ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు.



సంబంధిత వార్తలు

Online Betting in Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Kailash Gehlot Resigns AAP: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్..ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్‌కు రాజీనామా చేసిన మంత్రి కైలాష్ గెహ్లాట్..ఆప్‌తో ఢిల్లీ అభివృద్ధి శూన్యమని ఫైర్