Andhra Pradesh: లోకేష్‌ పుట్టుకతో వచ్చిన సమస్యతో ఇలా తయారయ్యాడు, మండిపడిన విజయసాయి రెడ్డి, లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్‌తో అంటూ అయ్యన్న కౌంటర్

టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది. మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు.

Vijaya sai Reddy (Facebook)

Amaravati, June 10: టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది. మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు. తండ్రి కొడుకులు బుద్ది మార్చుకోకపోతే మేము తగిన బుద్ది చెప్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి హోం శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తాన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు సంవత్సరం ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయన్నారు. పార్టీ ఆఫీస్‌ అంటే దేవాలయం లాంటిదని మా నమ్మకమన్నారు.

జూమ్‌లోనే మ్యూట్ చేసి పారిపోయావ్, డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా లోకేశం, ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు విసిరిన విజయసాయి రెడ్డి

మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. నిన్నటిది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరింతగా ఎదురుదాడి చేస్తాం. అందుకే ఇకనైనా పద్దతులు మార్చుకోండి. టెన్త్ ఫెయిల్ అవటానికి కారణాలు తెలుసుకోవాలేగానీ సీఎంని తిట్టాల్సిన పనేంటి?. కుసంస్కారంతో మా నాయకులను తిట్టించకుండా వాస్తవాలు తెలుసుకోండి. ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహరించండి. లోకేష్ సవాల్‌ని స్వీకరిస్తున్నాం. చర్చకు రావాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు వచ్చినా సరే చర్చకు మేము సిద్దం. జూమ్‌లో మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు.

ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వర్తించే కార్యక్రమాలు చేస్తోంది. అందుకే టీడీపీకి కడుపుమంట. కుప్పంలో కూడా ఓడిపోయినప్పుడే మాకు 175 గ్యారెంటీగా వస్తాయని నమ్మకం ఉంది. మీకు దమ్ముంటే ఆత్మకూరులో పొటీ చేసి రెఫరెండం కోరండి. అసలు పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా?. టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితేనే వంశీ, కొడాలి నాని, రజని ఎంటర్ అయ్యారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి?. ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉంటే వారింటికి వెళ్లి ఓదార్చాలని విజయసాయిరెడ్డి అన్నారు.

నారా లోకేష్ జూమ్ మీటింగ్ రచ్చ, పారిపోయాడన్న కొడాలి నాని, జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపిన అచ్చెన్నాయుడు

అంతేగానీ రాజకీయాలు చేయటం కరెక్టు కాదు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. మా కార్యకర్తలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఏ నాయకుడూ కార్యకర్తలను వదులుకోలేరు. కార్యకర్తలు, నాయకుల వలనే 2019లో అధికారంలోకి వచ్చామని విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గెలుపు కోసం పని చేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తానేటి వనిత అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రిగా జిల్లాలో గెలుపుకోసం నావంతు కృషి చేస్తానని అన్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి సవాల్‌కు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘దొంగలెక్కలు రాసి ఊచలు లెక్కెట్టిన నువ్వు.. సవాల్ విసరడం ఏంటి సాయిరెడ్డి?. నీ రేంజ్‌కి మా ఆఫీస్‌లో అటెండర్ చాలు. లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్‌తో.. మీ వాడికి దమ్ముంటే చర్చకు రమ్మను. ఎనీ బ్లూ మీడియా.. లోకేష్ ఈజ్ రెడీ’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

కాగా... పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిన్న(గురువారం) జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులను అడ్డుపెట్టుకుని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు. జూమ్‌లో కాదు... నేరుగా వచ్చినా మీరేమీ చేయలేరు. పదో తరగతి ఫెయిలైన వైసీపీ కుక్కల్ని పంపడం కాదు! జగన్‌ రెడ్డీ... స్వయంగా నువ్వే రా! పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా చానల్‌లోనే చర్చించుకుందాం’’ అని లోకేశ్‌ సవాల్‌ చేశారు.

లోకేస్ సవాల్‌పై (Nara Lokesh's challenge) విజయసాయిరెడ్డి...లోకేష్ సవాల్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పూ అంటూ లోకేష్‌ను ఎద్దేవా చేశారు. ‘‘జూమ్ మీటింగ్‌లోకి వస్తే మ్యూట్ చేశావు... ప్రత్యక్షంగా వస్తే తట్టుకోగలవా లోకేశం’’ అంటూ ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now