MP Vijayasai Reddy: మీడియా రంగంలోకి వస్తున్నానంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు తాను సిద్ధమని సవాల్

విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు.

MP Vijayasai Reddy (Photo-Twitter)

Visakha, Oct 11: ఎల్లో మీడియాపై, టీడీపీపై వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) మండిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు. విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎల్లోమీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కొన్ని పత్రికలు కులం అనే ఇంకుతో విషపు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు.

‘వైఎస్‌ఆర్‌సీపీపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈనాడు దాని అనుబంధ కుల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. విషపు రాతలతో కొత్తదారులు అన్వేషిస్తున్నారు. ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం శోచనీయం. వికేంద్రీకరణపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దసపల్లా భూముల విషయంలో బిల్డర్లు, యజమానులు క్లారిటీ ఇచ్చారు. సుప్రీం తీర్పును అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ చర్యలతో 400 కుటుంబాలకు మేలు జరిగింది.

పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా, చంద్రబాబు ఏ ట్వీట్‌ పెట్టమంటే అది పెడతాడు, దమ్ముంటే చర్చకు విజయవాడ రావాలని సవాల్ చేసిన మంత్రి జోగి రమేష్

64 ప్లాట్ యజమానుల్లో 55 మంది చంద్రబాబు సామాజిక వర్గం వారే. ఉత్తరాంధ్రలో కాపులు, వెలమలు, యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారు. కానీ, భూములు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. కొన్ని పత్రికలు టీడీపీ కరపత్రం కంటే దిగజారిపోయాయి. కుల పత్రికలపై ఉమ్మి వేసే పరిస్థితి ఏర్పడింది. రామోజీకి నైతిక విలువలు లేవు.. పుట్టుకే అనైతికం.’అని తీవ్రంగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు తాను సిద్ధమని.. రామోజీ, చంద్రబాబు సిద్ధమేనా అంటూ సవాల్‌ చేశారు విజయ సాయి రెడ్డి. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందన్నారు. ‘మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందాం. ఒక్క ఫిలింసిటీలోనే 2,500 ఎకరాలు ఆక్రమించుకున్నారు. పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? మార్గదర్శి డిపాజిటర్లను మోసం చేసిన వ్యక్తి రామోజీ.ఆస్తులపై విచారణకు చంద్రబాబు, రామోజీ సిద్ధమా?’ అంటూ సవాల్‌ చేశారు.



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం