Amaravati Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ
ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Vjy, Sep 26: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్పులు చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది.దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ లో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబును బెయిల్‌పై బయటకు రప్పించేందుకు తరచూ న్యాయవాదులతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ తయారీ ఆమోదంలో.. చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్, మరికొందరు తమ అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని సమాచారం.
చంద్రబాబు నాయుడుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు
ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది.ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్ పేరును మెన్షన్ చేసింది ఏపీ సీఐడీ.ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసులోనూ లోకేష్ నిందితుడిగా ఉన్నారు.