AP Local Body Polls: ఏపీలో కొనసాగుతున్న నాలుగో దశ పోలింగ్, మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాల్లో 554 మంది ఏకగ్రీవం

నాలుగో దశలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్‌ (AP Local Body Polls) కొనసాగుతోంది. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడిస్తారు

Telangana Civic Polls 2020 | (Photo-PTI)

Amaravati, Feb 21: ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు.

మొత్తం పంచాయతీల్లో ( Panchayat Elections in AP) సర్పంచ్‌ స్థానాలకు 554 మంది ఏకగ్రీవమయ్యారు. రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు దాఖలు కాలేదు. మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు 33,435 వార్డులకు 10,921 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 161 మండలాల్లో మొత్తం 67,75,226 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే మూడ దశల ఎన్నికలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8.30 గంటల వరకు 13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఆ ఏకగ్రీవాలపై మీరు ఎలాంటి జోక్యం చేసుకోరాదు, ఎసీఈసీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా

విశాఖపట్నం పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో టీడీపీ, వైస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతపురం పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు హైఅలర్ట్ ప్రకటించారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధులకు పోలీసుల సాయం అందేలా ఆదేశాలు ఇచ్చారు. మండలానికో డీఎస్పీతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.