MLA Anam Ramanarayana Reddy: చంద్రబాబు సై అంటే ఎక్కడినుంచైనా పోటీ చేస్తా, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు, నెల్లూరులో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం

చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు.

Anam Ramanarayana Reddy (Photo-Video Grab)

Nellore, May 23: వైసీపీ నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన భవిష్యత్ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని తెలిపారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉంది, కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే

రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా ఆనం స్పందించారు. ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి 60 శాతం మంది వైసీపీ నుంచి చేరతారని అన్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పనుల కోసం చాలా మంది ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు.