Andhra Pradesh Politics: దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవండి, ఆ ముగ్గురికి సవాల్ విసిరిన మాజీ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.

AP Ex Minister Vellampalli Srinivas (Photo-Video Grab)

Vjy, Nov 15: ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ కు పోటీ చేయడానికి నియోజకవర్గమే లేదని ఎద్దేవా చేశారు. వీళ్లు ముగ్గురూ దేనికీ పనికిరాని వ్యక్తులని విమర్శించారు. జగన్ పాలనలో సామాన్యులు సంతోషంగా బతుకుతున్నారని... సామాన్యులు మంచిగా ఉంటే పవన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు.

పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపిన సీఎం జగన్, వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ముఖ్యమంత్రి

తమ ప్రభుత్వంలో ప్రతి పిల్లోడికి అమ్మఒడి ఇస్తున్నామని చెప్పారు. కక్కుర్తి పడే పద్ధతి తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని... ప్రతి రోజు 2 వేల నుంచి 3 వేల మంది వరకు వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని... ఈ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జగనన్న సురక్ష క్యాంపులను వెల్లంపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.



సంబంధిత వార్తలు

Nara Ramamurthy Naidu Passed Away: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి, మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..హీరో నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన