Andhra Pradesh Rail Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, ఢీకొన్న రెండు రైళ్లు, పట్టాలు తప్పిన మూడు బోగీలు..
వార్తా సంస్థ ANI రిపోర్ట్ ప్రకారం, విజయనగరం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలు మరొక ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో 3 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. వార్తా సంస్థ ANI రిపోర్ట్ ప్రకారం, విజయనగరం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలు మరొక ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో 3 కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం మేరకు విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు కొత్తవలస(ఎం) అలమంద-కంటకపల్లి వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనంత ఎక్కువ అంబులెన్స్‌లను పంపాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.