AP's COVID Status: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 137 కరోనా కేసులు నమోదు, 1488గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, కొనసాగుతున్న టీకాల పంపిణీ
ఇలా ఇప్పటివరకు 8,78,060 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,488 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
Amaravati, January 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ మహామ్మారి భారీగా తగ్గుముఖం పట్టింది. ప్రతిరోజు సాధారణ స్థాయిలోనే కేసులు నమోదవుతున్నాయి. అటు రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ కూడా చాలా చురుగ్గా సాగుతోంది, ప్రతిరోజు పంపిణీ అవుతున్న వ్యాక్సిన్ డోసుల్లో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీనే మెరుగైన గణాంకాలను నమోదుచేస్తుంది.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,313 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 137 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,86,694కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,83,799గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి, కృష్ణా మరియు విశాఖ జిల్లాల నుంచి చెరి 17 కేసుల చొప్పున నివేదించబడగా అనంతపూర్ నుంచి 15 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 4 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7141కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 167 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,78,060 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,488 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.