AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 477 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,929కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 106కు పెరిగిన కరోనా మరణాలు

కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు, కర్నూల్ నుంచి ఒకరు మరియు చిత్తూరులో ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 106 కు పెరిగింది....

COVID19 Outbreak in Andhra Pradesh | Photo: Pixaby/ Twitter

Amaravati, June 21: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,929 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,059 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 24,451 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కొత్తగా మరో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు, కర్నూల్ నుంచి ఒకరు మరియు చిత్తూరులో ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 106 కు పెరిగింది.

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 151 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 4,307 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 4516 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.



సంబంధిత వార్తలు

Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా